రాష్ట్రం లోని అన్ని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశానికి ఈ నెల 20వ తేదీలోగా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ (కొండపాక) సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని శనివారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఓసీ, బీసీ విద్యా ర్థులైతే 9 ఏండ్లు నిండి 11 ఏండ్లు వయసు దాటని వారు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 13 ఏండ్లు దాటకూడదని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలైతే రూ.1.50 లక్షలు, పట్టణాలైతే రూ.2లక్షలు మించని విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని తెలిపారు. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో జరుగుతుందని, ఆసక్తి గల విద్యార్థులు www.tswries.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.