పినపాక నియోజకవర్గంలో శనివారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓ ప్రకటనలో తెలియజేశారు. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని అన్నారు. కావున ఈ విషయాన్ని ఆయా మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజాప్రతినిధులు అధికారులు గమనించి మంత్రి పువ్వాడ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
![]() |
![]() |