తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు ఒకరు సీఎం అవుతారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా శంకరంపేటలో మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీలు సంతకాలు లేని పోస్ట్ డేటెడ్ చెక్కులని విమర్శించారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన ప్రశ్నించారు.
![]() |
![]() |