నాలుగు వేల సంవత్సరాల చరిత్ర సనాతన ధర్మంకు ఉందని, అలాంటి అతి పురాతనమైన సనాతన ధర్మం లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీతో ఉన్న వారు అంటున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాహుల్ గాంధీ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. ప్రపంచంలో మోదీకి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. గాంధీ పేరు పెట్టుకుని ఇన్నాళ్లు దేశాన్ని ఏలినా పేదరికం నిర్మూలించలేదన్నారు. కాంగ్రెస్ మతచిచ్చు రేపి రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఉచిత పథకాలతో ఎలాంటి అభివృద్ధి జరగదని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారన్నారు.