జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అజారుద్దీన్‌పై కేసు నమోదయింది. ఎన్నికల ప్రవర్తన నియామావళి ఉల్లంఘించారనే కారణంతో ఫిలిమ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన పలువురు అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కేసులు నమోదు చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్, మజ్లిస్ నుంచి మొహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రేపు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.