అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యఘట్టానికి సమయం అసన్నమైంది. గురువారం పోలింగ్ ప్రక్రియ జరగనుండగా. అందుకు ఖమ్మం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో పోలింగ్ విధులు కేటాయించిన సిబ్బంది అంతా ఈవీఎంలను తీసుకుని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. గురువారం పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఆయా ఈవీఎంలను తీసుకుని కౌంటింగ్ కేంద్రం వద్ద స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచనున్నారు.