నారాయణపేట పట్టణానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు రథంగ్ పాండు రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. కాగ ఆయన తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు రాజీనామా చేసిన జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిమూద్ అలీ వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సోమవారం డీకే అరుణ తోపాటు కార్యక్రమాల్లో వీరు పాల్గొన్నారు.