గద్వాల జిల్లా వ్యాప్తంగా సోమవారం విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు విద్యార్థులు తెలుగు పరీక్ష రాశారు. 294 ప్రాథమిక, 144 ప్రాథమికోన్నత, 154 ఉన్నత ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు 90, 850 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.