తిరుమలాయపాలెం మండలం జూపెడకి చెందిన ఎలక వెంకటేశ్వర్లు ఇంటి ముందు ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును పది మీటర్ల మేర రోడ్డును ధ్వంసం చేసినందుకు గ్రామస్తులు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్ సీటు కోర్టులో ప్రవేశపెట్టగా ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. గోపిక నాగ శ్రావ్య సోమవారం రెండు సంవత్సరాలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చారు.