ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (గురువారం) నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని పేర్కోన్నారు. కావున జిల్లా రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.