ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ భువనగిరి మండల పరిధిలోని చందుపట్లకు చెందిన నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు, రూ.25 వేలు జరిమానా విధిస్తూ..రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంకే పద్మావతి సోమవారం తీర్పునిచ్చారు. బాధిత బాలికకు రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫార్సు చేసింది. 2017లో బాలికను అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.