నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణ బిజెపి కార్యవర్గ సమావేశం శుక్రవారం పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతి కార్యకర్త సైనికుడై జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలో భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మిరియాల వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.