మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు పొదుపుసంఘాల మహిళలు ముందుకురావాలని మున్సిపల్ కమిషనర్ ఎండి యూసుఫ్ కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పట్టణస్థాయి బ్యాంకర్స్ సమావేశములో మెప్మా అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. మహిళాశక్తి క్యాంటీన్ ల ఏర్పాటు కు స్థల పరిశీలన పూర్తయినందున ఆసక్తిఉన్న సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.