నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 52,199 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 6,282 క్యూసెక్కులు ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 506.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.97 టీఎంసీలుగా ఉంది.