పాలమూరు ఉమ్మడి జిల్లాలోని జూరాల జలాశయానికి వరదనీరు పోటెత్తి జలసిరులు సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరగడంతో 46 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నిండు కుండలా ఉన్న జూరాల జలాశయాన్ని చూసేందుకు శుక్రవారం సందర్శకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఇందుకు సంబంధించిన జూరాల జలాశయం డ్రోన్ విజువల్స్ అందరినీ మైమరపిస్తోంది.