మరికల్ మండలం పెద్ద చింతకుంట ప్రభుత్వ పాఠశాలలో శనివారం షి టీమ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు షి టీమ్ సభ్యులు బాలరాజు, సమీన తెలిపారు. ఆకతాయిలు నుండి వేధింపులు ఎదురైతే షి టీమ్ సభ్యులకు సమాచారం ఇవ్వాలని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ర్యాగింగ్ చేయడం, ఈవ్ టీజింగ్ చట్టరీత్య నేరమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.