కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. అన్నప్రాశన రోజే ఆవకాయ పెట్టినట్లుగా కొందరి వ్యవహారి శైలి ఉందన్నారు. ఆర్నెళ్లకే అన్నీ చేయలేదు అని ఈ ప్రభుత్వాన్ని అనటం సరికాదని వత్తాసు పలికారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని భావిస్తున్నాని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వాలని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలనే ప్రభుత్వం భావిస్తుందని స్పష్టం చేశారు.