కారేపల్లి మండలంలోని పేరుపల్లి వద్ద బుగ్గవాగు పొంగిపోర్లింది. ఇల్లెందు అటవీప్రాంతంలో భారీ వర్షం పడటంతో ఒక్కసారిగా బుగ్గవాగు ఉగ్రరూపం చాల్చింది. ఉదృతి క్షణక్షణానికి పెరుగుతూ పేరుపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీని ముంచెత్తింది.
దీంతో స్థానికులు మోకాళ్ల లోతు నీళ్లల్లో గగ్గోలు పెట్టారు. ఈ విషయమై అప్రమత్తమైన ఆధికారులు, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. పేరుపల్లి-మాధారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.