ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'నా కారులో నో రొమాన్స్'.. ప్యాసింజర్లకు క్యాబ్ డ్రైవర్ వెరైటీ కండీషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 07:20 PM

గతంలో క్యాబ్ అంటే.. పెద్ద పెద్ద వాళ్లు మాత్రమే బుక్ చేసుకుంటారనే భావన ఉండేది. కానీ.. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి యాప్‌లు అందుబాటులోకి రావటంతో.. సామాన్యులు కూడా క్యాబ్‌లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. అందుకు సరసమైన ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తుండటమే కారణం. అయితే.. ఈ క్యాబ్‌ సర్వీసులను కొందరు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. కొంతమంది యువతీ యువకులు క్యాబ్ బుక్ చేసుకుని.. గమ్యం చేరే గ్యాప్‌లో.. ఖాళీగా ఉండటమేందుకూ అనుకుంటారో.. లేక ఇంతకంటే ప్రైవేట్ ప్లేస్ ఇంకోటి దొరకదూ అనుకుంటారో కానీ.. వెనక సీటులో విపరీత చేష్టలతో రెచ్చిపోతుంటారు. అయితే.. వెనక సీటులో నడుస్తున్న రొమాన్స్‌ని డ్రైవర్ ఓ కంట కనిపెడుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా తమ పని తాము కానిచ్చేస్తుంటారు. ఇలాంటివి ఎన్ని సీన్లు చూశాడో.. అవి చూసి చూసి విసుగెత్తుకొచ్చిందో.. లేదా వెనుక జరిగే పనితో తన పనిమీద దృష్టి పెట్టలేకపోతున్నాడో కానీ.. ఓ క్యాబ్ డ్రైవర్ తన కారు ఎక్కే ప్యాసింజర్లకు వెరైటీ కండీషన్ పెట్టాడు.


"వార్నింగ్.. నో రొమాన్స్.. ఇది క్యాబ్.. మీ ప్రైవేట్ ప్లేస్ కాదు.. ఓయో రూమ్ అంతకంటే కాదు.. కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ సైలెంట్‌గా కూర్చోండి." అంటూ వెనక సీట్ల వారికి కనిపించేలా ముందు సీట్లకు పోస్టర్ అతికించాడు. కాగా.. ఓ ప్యాసింజర్ ఆ పోస్టర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ ఫొటోను "హాయ్ హైదరాబాద్" అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేయగా.. దానికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.


"అంటే.. క్యాబ్‌లో కూడా రొమాన్స్ చేస్తున్నారా..?" అంటూ ఓ నెటిజన్ అమాయకంగా అనుమానం వ్యక్తం చేయగా.. "ఎన్ని చూశాడో.. భరించలేక ఇలా వార్నింగ్ ఇచ్చాడు.." అంటూ ఇంకో నెటిజన్ తన అభిప్రాయం తెలపగా.. "నో రొమాన్స్ అంటే ఓకే కానీ.. డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేయమనటం ఏదైతే ఉందో.." అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.


అయితే.. ఈమధ్య ప్రేమ మత్తులో యువత విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండటం చాలా సందర్భాల్లో వెలుగుచూస్తునే ఉంది. ఇంతకుముందు పార్కుల్లోని తుప్పల్లో ముద్దూముచ్చట కానిచ్చే యువత.. ఇప్పుడు మెట్రో లిఫ్టుల్లో, ఓయో రూముల్లో మొదలుపెట్టగా.. అధికారులు అన్నింటిపై ఫోకస్ పెట్టారు. దీంతో.. ఎక్కడా ప్రైవసీ దొరక్క.. ఇలా క్యాబుల్లో, బైకులపైనే రెచ్చిపోతున్నారు. ఇటీవలే.. హైదరాబాద్‌లో ఓ జంట రన్నింగ్ బైక్ మీదే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన వార్నింగ్ ద్వారా.. క్యాబ్‌లను కూడా యువత గట్టిగానే వాడుతున్నట్టు అర్థమవుతోంది. దీంతో.. ఆ దరిద్రాలను చూసి చూసి మొహమ్మొత్తిన క్యాబ్ డ్రైవర్.. డైరెక్టుగా వళ్లను వద్దని చెప్పలేక.. ఇలా వెరైటీ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.


ఇదిలా ఉంటే.. గతంలో బెంగళూరులోనూ ఓ క్యాబ్ డ్రైవర్ ఇలాగే.. ప్యాసింజర్లకు వార్నింగ్ పోస్టర్ పెట్టటం వైరల్ అయ్యింది. అయితే.. ఆ బెంగళూరు క్యాబ్ ఇలా ఒక్క కండీషన్‌తో సరిపెట్టలేదు.. ఓ లిస్టే పెట్టాడు. తనను భయ్యా అని పిలవకూడదని.. క్యాబ్ డ్రైవర్‌తో మర్యాదగా మాట్లాడి గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని.. యాట్టిట్యూడ్ ఉంటే దాన్ని జేబులో మడిచి పెట్టుకోవాలని.. క్యాబ్ యజమానిలా ప్రవర్తించొద్దని.. డోర్ మెల్లిగా వేయాలని.. ఇలా పెద్ద లిస్టే పెట్టారు. ముఖ్యంగా.. ఫాస్ట్‌గా వెళ్లాలంటూ తొందరపెట్టొంద్దంటూ రెడ్ కలర్‌లో రాసుకొచ్చాడు. ఇది అప్పట్లో వైరల్‌గా మారింది. కాగా.. ఇప్పుడు ఈ క్యాబ్ డ్రైవర్ పెట్టిన కండీషన్ కూడా వైరల్ అవుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com