ముదిరాజ్ ల సమస్యల పరిష్కారానికి సిఎం రేవంత్ రెడ్డి చొరవ ...మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చక్రిపురం క్రాస్ రోడ్ సిరి గార్డెన్స్ లో కుషాయి గూడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమం..తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్,మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్,ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి,స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గార్లతో కలిసి పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..హక్కుల సాధన కోసం, సామాజిక న్యాయం కోసం పార్టీలకతీతంగా ఐక్యమత్యంగా ముదిరాజ్ లందరు ఒక్క తాటి పైకి రావడం మన ఐక్యమత్యానికి నిదర్శనమని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండీడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చక్రిపురం క్రాస్ రోడ్ సిరి గార్డెన్స్ లో కుషాయి గూడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు, ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అని తొందర్లోనే బీసీ కుల గణన పూర్తి అవుతుందని చెప్పారు, కుల గణన తర్వాత ముదిరాజులను బిసి డీ నుంచి బీసీ ఎ లోకి మార్చి ప్రక్రియ కోసం కృషి చేస్తానని మరియు ముదిరాజ్ ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించేలా చొరవ తీసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మన ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చొప్పరి శంకర్ ముదిరాజ్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండగ బాలు, సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ సుంకరబోయిన మహేష్,పిట్టల నాగరాజ్, గడ్డల పాండు,జెడల శంకర్, పుర యాదగిరి,శ్రీకాంత్,హరి బాబూ,ముదిరాజ్ కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.