మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో సిద్దిపేట జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా కెడం లింగమూర్తి పదవీ బాధ్యతలను స్వీకరించిన శుభ సందర్భంగా ఆర్ టి ఐ ప్రచార కమిటి చైర్మన్ రాసూరి మల్లికార్జున్ వారి నివాసంలో ప్రత్యేకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..కెడం లింగమూర్తి పార్టీలో చేరిన నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యార్థి దశ నుండి అంచలంచలుగా ఎదుగుతూ హస్నాబాద్ హైస్కూల్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్,యూత్ కాంగ్రెస్ ఇందుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా, డి సి సి మెంబర్ గా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా,నాలుగు పర్యాయాలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా , హుస్నాబాద్ సర్పంచ్ గా బాలవికాస స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ అధ్యక్షులుగా, కొనసాగుతున్నారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న పార్టీతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం , హుస్నాబాద్ పట్టణ వివిధ సంఘాల గౌరవాధ్యక్షులుగా కొనసాగుతున్నారు 2018 లో sc.st అట్రాసిటీ పరిరక్షణ కమిటీ హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా హుస్నాబాద్ అభివృద్ధి కోసం ఎన్నో ఆర్జీలు పెట్టిన నిస్వార్థ సేవకుడు ఈ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక రకాల ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన నాయకుడిగా నిలిచారు. 2007 లో హుస్నాబాద్ జరిగిన ఒక బహిరంగ సభకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించడంతో వై ఎస్ ఆర్ సానుకూలంగా స్పందించి అదే వేదికలో గౌరవెల్లి గండి పెళ్లి రిజర్వాయర్ ను ప్రకటన చేయడం జరిగింది. హుస్నాబాద్ అభివృద్ధిలో డిగ్రీ కాలేజ్. 100 పడకల ఆసుపత్రి. మెడికల్ కాలేజ్ నిరుద్యోగ యువతకు ఉపాది అవకాశాలు రావాలని తపన పడుతు కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొన్నం ప్రభాకర్ మెప్పు పొందిన రాజకీయ నాయకుడు కెడం లింగమూర్తి అని కొనియాడారు. ఈ నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి పార్టీ శ్రేణులకు,నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెన్న రాజు ,మిట్టపల్లి చెన్నారెడ్డి,సంగెం మధు, మాంకాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.