కేంద్ర బీమా పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఏపీజీవీబీ జగదేవపూర్ మేనేజర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని బస్వాపూర్ గ్రామంలో లీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి సురక్ష యోజన పథకం, జీవనజ్యోతి యోజన పథకం, అటల్ పెన్షన్ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బీమా పథకాలు కుటుంబానికి కొండంత ధీమానిస్తాయని వివరించారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ భీమా సౌకర్యం ఉంటుందని వివరించారు. గ్రామాల్లో బీమా పథకాలను కట్టుకునేవారు బ్యాంకు మిత్రలను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది నర్సింలు, సురేందర్, కనక లక్ష్మీ, శకుంతల, యాదగిరి తదితరులు పాల్గొన్నారు...