ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెయ్యేస్తే వెయ్యి, సరసాలాడితే 1500.. ఇక అలా చేయాలంటే..? టాస్ పబ్‌ కేసులో నోరెళ్లబెట్టే నిజాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2024, 08:30 PM

హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతోంది. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో విచ్చలవిడిగా పబ్‌లు ఏర్పాటు చేసి.. యువతను ఆకర్షిస్తున్నాయి. కొన్ని పబ్‌లు అనుమతులు తీసుకుని.. నిబంధనల మేరకు నడుస్తుంటే.. మరికొన్ని పబ్‌లు మాత్రం అనుమతులు లేకుండానే వెలిసి.. లోపల గబ్బు గబ్బు పనులకు అడ్డగా మారుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం, ఆశ్లీల నృత్యాలతో పాటు.. కొన్నింట్లో ఓ అడుగు ముందుకేసి వ్యభిచారం లాంటి చీకటి వ్యవహారాలు కూడా నిర్వహిస్తున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్-3లోని టేల్స్ ఓవర్ ద స్పిరిట్స్ (టాస్) పబ్‌ చేసే గబ్బు పనులు వెలుగులోకి వచ్చాయి.


పోలీసులకు వచ్చిన సమాచారంతో శుక్రవారం (అక్టోబర్ 18న) రోజున అర్ధరాత్రి 12 గంటలకు టాస్ పబ్‌ మీద పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఊగిపోతున్న యువకులు, అర్ధనగ్న రీతిలో నృత్యాలు చేస్తున్న యువతులను పోలీసులు గమనించారు. మొత్తం 100 మంది యువకులతో పాటు 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ పబ్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. పట్టుబడినవారందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ జరపగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు బంజారాహిల్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.


టాస్ పబ్‌లో కొంతకాలంగా.. అమ్మాయిలను ఎరగా వేస్తూ.. అబ్బాయిలను ఆకర్షిస్తూ ఎక్కువ మద్యం తాగేలా చేసి.. అందినకాడిన దండుకుంటున్నట్టుగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. దీంతో.. దాడి చేసి పబ్‌ యజమానులు ఉప్పల్‌కు చెందిన డింగి బలరామ్‌గౌడ్, జగద్గిరిగుట్టకు చెందిన డింగి శ్రీనివాస్‌గౌడ్, మేనేజర్‌ అలీం, బార్‌ టెండర్‌ రామకృష్ణపై కేసులు నమోదు చేయగా.. పబ్‌ యజమానులు బలరాంగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌లు పరారీలో ఉన్నట్టు చెప్తున్నారు. కాగా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూసినట్టు వివరించారు.


అసలు టాస్ పబ్‌కు ఎలాంటి అనుమతి లేదని తేలింది. కాగా.. పబ్‌కు వచ్చిన అబ్బాయిలకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నారు. అబ్బాయిలపై వలపు వల విసురుతూ వెర్రెత్తిస్తూ.. ఎక్కువ మద్యం తాగించేందుకు అమ్మాయిలను నియమించుకున్నారు. ఓ కస్టమర్‌ను రెచ్చగొడుతూ ఎంత ఎక్కువ బిల్లు చేయిస్తే అంత కమిషన్ ఇచ్చేలా డీల్ మాట్లాడుకుంటున్నారు. అమ్మాయిలకు కురచ దుస్తులు వేసి.. వారితో చనువుగా ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. అందుకు రకరకాల ఓపెన్ ఆఫర్లు కూడా పెట్టారు. అమ్మాయి పక్కన కూర్చుంటే రూ.500.. మీద చెయ్యి వేస్తే రూ.1000.. సరసాలు ఆడితే రూ.1500.. అర్ధనగ్నంగా మారి నృత్యాలు చేస్తే రూ.2,000.. చెల్లించేలా రేట్లు కూడా ఫిక్స్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com