కోహెడ ప్రాథమిక సహకార సంఘము ఆధ్వర్యంలో శనివారం గొట్లమిట్ల. నారాయణపూర్, వింజపల్లి, ధర్మసాగర్ పల్లి,పరివేద,శ్రీరాములపల్లి, నకిరేకొమ్ముల, విజయనగర్ కాలనీ గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రాంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందుకోసం క్వింటాలుకు రూ.500 బోనస్‌ను చెల్లిస్తుందని అన్నారు. "ఏ" గ్రేడ్ వరి ధాన్యానికి రూ.2320, సాధారణ రకానికి రూ. 2300, సన్నరకానికి బోనస్ క్వింటాలుకు రూ.500లను కలిపి రైతుకు చెల్లిస్తుందన్నారు. వరిధాన్యం తీసుకొచ్చిన రైతులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొవాలని, కొనుగోలులో జాప్యం జరుగకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు సూచించారు.
ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా చూసుకునే బాధ్యత అధికారులదేనని, ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని, దళారుల వద్దకు వేళ్లి మోసపొవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ బద్దం కొండల్ రెడ్డి,బొబ్బల కొండల్ రెడ్డి, నిరటి దేవయ్య,పబ్బతి సుగుణమ్మ ప్రజా ప్రతినిధులు మంద ధర్మయ్య, దొమ్మటా జగన్ రెడ్డి,బద్దం తిరుపతి రెడ్డి,బోలుమల్ల చంద్రయ్య,అన్నబోయిన కనుకయ్య,మెట్టు రాజేందర్ రెడ్డి, లింగం సీతారి, లోనే మల్లేశం, ద్యాగటి సురేందర్, బద్దం రాజిరెడ్డి, చింతలపల్లి తిరుపతి రెడ్డి, చింతలపల్లి ప్రతాప రెడ్డి,కరివేద చంద్రారెడ్డి, గాజుల వెంకటేశ్వర్లు, సీఈఓ ముంజ మలికార్జున్ , రైతు సోదరులు, హమాలీలు ప్యాక్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.