సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న గ్రూప్-1 పరీక్షల నేపథ్యంలో పత్రిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. TGPSC కార్యాలయాన్ని ముట్టడికి వెళ్లే అవకాశం ఉండడంతో కేటీఆర్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్లినా చెప్పే వెళ్లాను.. చెప్పకుండా వెళ్లను. నాకు భయం ఏముంటుందని గస్తీ కాస్తున్న పోలీస్తో చెప్పారు.