తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు మానేసి మంచి సలహాలు ఇవ్వాలని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై అదే పనిగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ పై మంత్రి మండిపడ్డారు.
రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగాలు, హైడ్రా, మూసీ నిర్వాసితుల విషయంలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు.