దేవరకొండ పట్టణంలో ఆదివారం బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందని వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని. లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందని బి ఆర్ ఎస్ నాయకులు అన్నారు.
రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగింది. ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారు.మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేదిలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో, ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు,బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ,మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు రమావత్ నర్సింహ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.