ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ నగరవాసులకు అలర్ట్.. రెండ్రోజులు నీటి సరఫరా బంద్‌, ఈ ఏరియాల్లోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 07:36 PM

హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలో రెండ్రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి ఫేస్‌-3లోని 2375 MM డయా MS పంపింగ్‌ మెయిన్‌కు లీకేజీ ఏర్పడినట్లు వాటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. దీనిని అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టారు. వీటిని ఈ నెల 24న (గురువారం) ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు (శుక్రవారం) సాయంత్రం ఆరు గంటల వరకు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ 24 గంటలు పలు రిజర్వాయర్‌ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.


ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..


షేక్‌పేట్‌, ఆళ్లబండ, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, శాస్త్రీపురం, బండ్లగూడ, భోజగుట్ట, ప్రశాసన్‌నగర్‌, తట్టిఖానా, లాలాపేట్‌, సాహెబ్‌నగర్‌, వాసవి రిజర్వాయర్లు, సైనిక్‌పురి, ఆటోనగర్‌, సరూర్‌నగర్‌, మౌలాలి, గచ్చిబౌలి, మాదాపూర్‌, అయ్యప్ప సొసైటీ కావూరిహిల్స్‌, స్నేహపురి, బుద్వేల్‌, సులేమాన్‌నగర్‌, గోల్డెన్‌హైట్స్‌, కైలాసగిరి, దేవేంద్రనగర్‌, మధుబన్‌, దుర్గానగర్‌, 9 నంబర్‌, కిస్మత్‌పూర్‌, గంధంగూడ, బోడుప్పల్‌, మల్లికార్జుననగర్‌, మాణిక్‌చంద్‌, చెంగిచెర్ల , పెద్ద అంబర్‌పేట్‌, భరత్‌నగర్‌, ఫీర్జాదిగూడ, ధర్మసాయి ఏరియాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.


ఆపరేషన్ మ్యాన్హోల్స్


ఇక సరైన పర్యవేక్షణ లేకుండా ఏళ్లుగా నిండిపోయిన డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు వాటర్బోర్డు అధికారులు సిద్ధమయ్యారు. 90 రోజుల స్పెషల్ డ్రైవ్లో ప్రతి మ్యాన్హోల్ను క్లీన్చేయాలని నిర్ణయించింది. మూడున్నర లక్షల మ్యాన్హోల్స్క్లీన్ చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు వాటర్ బోర్డు ఎండీ అశోక్రెడ్డి వెల్లడించారు. రోజుకు 400 మ్యాన్ హోల్స్ క్లీనింగ్ చేయాలని క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. క్లీనింగ్ కోసం 25 స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


ఒక్కో టీమ్లో ఐదుగురు సిబ్బంది ఉంటారని తెలిపారు. మ్యాన్హోల్స్ క్లీనింగ్ కోసం 200 ఎయిర్ టెక్ మెషీన్లు వినియోగిస్తున్నట్లు అశోక్ రెడ్డి వెల్లడించారు. పూడిక తీసిన తర్వాత వ్యర్థాలను తరలించడానికి మరో 140 సిల్ట్ క్యారియర్ వాహనాలను గ్రౌండ్‌ లెవల్‌లో అందుబాటులో ఉంచామన్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com