ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా స్పందించారు. ' కాంగ్రెస్ ప్రభుత్వానికి పంట పెట్టుబడి ఇవ్వడం చేతగాదు. పంటను కొనుగోలు చేయడం చేతగాదు.
రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా? అని ప్రశ్నించారు. 'సీఎం, మంత్రులు ఏం రాచకార్యాలు వెలగబెడుతున్నారు? అన్నదాతల అవస్థలను తీర్చడానికి తీరికలేదా? ఢిల్లీ టూర్లు, విదేశీ యాత్రలేనా పాలన అంటే?' అని కేటీఆర్ ప్రశ్నించారు.