పత్తి పంట కొనుగోలు ప్రక్రియను శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డు లో ప్రారంభించారు. ముందుగా పత్తి వేలం పాటను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజార్షిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఐ ద్వారా 8 తేమ శాతంతో క్వింటాలకు రూ. 7521 కొనుగోలు చేస్తుండగా. ప్రైవేట్ ద్వారా రూ. 7150 జిన్నింగ్ యజమానులు పాట పాడారు. అనంతరం కంటాకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ప్రారంభించారు.