రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, బట్టల షాప్ కావడంతో మంటలు శరవేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో షాపింగ్ మాల్లో ఎవరైనా ఉన్నారా అన్న విషయం ఇంకా తెలియ రాలేదు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి పక్క షాపులకు మంటలు వ్యాపించకుండా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలిసే అవకాశం ఉంది.