రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం రాదని మాజీమంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులనే కొడుతున్నారని, ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డు సాధించారన్నారు. ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని నాచారం వద్ద నిర్మించిన ఎస్టిపీ ( సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ) ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.