మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని ఆదివారం జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్ నర్సింహా, నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన సేవలకు సరైన గుర్తింపు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గొప్ప పదవులు చేపట్టి మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అన్నారు.