ఇప్పటికైనా హరీష్ రావును PAC చైర్మన్ ను చేయాలని డిమాండ్ చేశారు బాల్కొండ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.PAC సమావేశాన్ని బహిష్కరించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. PAC చైర్మన్ ఆరికేపుడి గాంధీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో PAC సభ్యులు పాల్గొన్నారు. అటు PAC ని బాయ్ కాట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ లుఎల్.రమణ,సత్యవతి రాథోడ్. అనంతరం తెలంగాణ భవన్ లో మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని సూచిస్తే వారిని పీఏసీ చైర్మన్ గా కేసీఆర్ నియమించారన్నారు.
క్రిష్ణారెడ్డి,గీతారెడ్డిని పీఏసీ చైర్మన్లుగా చేశామని… కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కె.సి.వేణుగోపాల్ పీఏసీ చైర్మన్ అయ్యారని గుర్తు చేశారు. హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారని మేము అడిగామని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేత కేసీఆర్ సూచించిన హరీష్ రావును పీఏసీ చైర్మన్ ను చేయాలని…డిమాండ్ చేశారు. అరికేపూడి గాంధీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారని చురకలు అంటించారు.