సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ సీతారామపురం కాలనీలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరును సోమవారం ఉదయం కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరూ కచ్చితంగా సమయ పాలనా పాటించాలని, తమకు కేటాయించిన పరిధిలో చెత్తాచెదారం లేకుండా చేయాలని, కాలనీవాసుల నుండి ఎటువంటి కంప్లైంట్ రాకుండా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.