బంజారాహిల్స్ రోడ్ నెం 14లో ట్రాఫిక్ పోలీసులు అపరేషన్ రోప్ కార్య క్రమాన్ని చేపట్టారు. నందినగర్ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు వెళ్లేదారిలో వెలిసిన రోడ్డు అక్రమణలను ట్రాఫిక్ పోలీసులు సోమవారం తొలగించారు. టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్లు, పండ్ల వ్యాపారాలు రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడంతో పాటు వాహనాలు పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఇటీవల వారికి హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ పద్దతి మార్చుకోకపోవడంతో వాటిని తొలగించారు. మరోసారి రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ హెచ్చరించారు.