పందుల దొంగతనాల కేసును త్వరగా ఛేదించినందున ఎరుకల సంఘం నాయకులు సిద్ధిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ అనురాధను సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో కుకునూర్‌పల్లి, దుబ్బాక, గౌరారం, మర్కూక్ పోలీసు స్టేషన్ల పరిధిలో పలు చోట్ల జరిగిన పందుల దొంగతనం కేసులను చేధించి పందులు, నగదును రికవరీ చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.