ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అలసత్వం వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహేడ మండలంలోని శనిగరం గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మను చౌదరి క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తేమ శాతం రాగానే లారీలలో లోడ్ చేయించాలని సెంటర్ అధికారులకు తెలిపారు. లారీలలో సీరియల్ వారిగా లోడ్ చేస్తున్నామని ఇప్పటివరకు సగానికిపైగా వరి కోనుగోలు పూర్తయిందని పది రోజులలో పూర్తి చేస్తామని సెంటర్ అధికారులు కలెక్టర్కు తెలిపారు. అందరు అధికార సమన్వయంతో ధాన్యం కొలుగోలు వేగంగా పూర్తి చేసి 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం శనిగరం గ్రామంలో గల వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ వారి బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. వసతి గృహంలో మరుగుదొడ్ల సౌకర్యం నీటి వసతి, కొండ ప్రాంతం పక్కన ఉన్నందున వర్షం కురిస్తే నీరు వసతి గృహం ఆవరణలో పెద్ద మొత్తంలో చేరుతుందని విషయాన్ని బిసి వెల్పర్ అధికారి కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆవరణ మొత్తం కలీయ తిరిగారు. వంటగది, సరుకుల స్టోర్ గదిని పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులు వచ్చి మీకు కావలసిన వాటిని పరిశీలించి ఎస్టిమేట్ వెసి ఇస్తే ప్రాధాన్యం ప్రకారం ఓక్కోక్కటిగా పరిష్కారిస్తామని హమి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపీడి జయదేవార్య,తహసిల్దార్ సురేఖ, ఏపీఎం తిరుపతి, అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.