పేద,మధ్యతరగతి ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పీఏసీ చైర్మన్ ,ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.సోమవారం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర్ నగర్ లో కాలనీ లో గల సగర సంగం కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ రోజాదేవి రంగారావుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అన్ని కులాల, వర్గాల శ్రేయస్సు కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, నిబద్దత క్రమశిక్షణకు మారుపేరైన సగరుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని అన్నారు.
అలాగే సగర మహిళ భవనం నిర్మాణం కోసం తన వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట సగర సంగం ప్రధాన కార్యదర్శి ఆస్కానీ శ్రీనివాస్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సగర ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆస్కానీ మారుతి సాగర్, జగద్గిరిగుట్ట సగర సంగం అధ్యక్షులు ఆస్కానీ కొండయ్య సాగర్, కోశాధికారి కొమ్ముల రాజేష్ సాగర్, సాగర సంగం రాష్ట్ర నాయకులు కే పి రామ్ సాగర్, రమేష్ సాగర్, కె.పి రాములు సాగర్, ఎం రాములు సాగర్, జి సత్యనారాయణ సాగర్ మరియు గౌరవ సలహాదారులు, సగర మహిళా సంఘం అధ్యక్షురాలు జి కుసుమసాగర్, కోశాధికారి సిహెచ్ జ్యోతి సాగర్, వార్డు కమిటీ సభ్యులు చంద్రమోహన్ సాగర్, యువజన సంఘం అధ్యక్షులు ఎం మురళి సాగర్, ప్రధాన కార్యదర్శి సిహెచ్ శేఖర్ సాగర్, కోశాధికారి సంపత్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.