మండల వ్యాప్తంగా కొనసాగుతున్న పశుగణన కార్యక్రమానికి ప్రజలు సమాచారం అందించి సహకరించాలని మండల పశువైద్యాధికారిణి శ్వేత కోరారు. మండల కేంద్రంతో పాటు లింగారెడ్డిపల్లి లో జగదేవ్పూర్ ప్రాథమిక పశు వైద్య, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం పశు గణనను చేపట్టారు.
ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న 21వ అఖిల భారత పశు గణన కార్యక్రమం రెండు నెలల పాటు కొనసాగుతుందన్నారు. ప్రతి రైతు తమ పాడి పశువుల పోగులు (ట్యాగ్) నంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు పశువుల సమగ్ర సమాచారాన్ని తెలిపి, పశుగణ రంగ పథకాల రూప కల్పనకు బాటలు వేయాలన్నారు. సర్వేలో వెటర్నరీ అసిస్టెంట్ శ్రీనివాస్, ఓఎస్ హరిప్రసాద్, గోపాల మిత్రలు కనక స్వామి, యాదగిరి ఉన్నారు.