సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం వసంతరావు రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ. డాక్టర్ రజిత, డాక్టర్ అంజలి వ్యా సక్టమి అవగాహన, శస్త్ర చికిత్సల పక్షోత్సవం 21.11.2024 నుండి 24.12.2024 వరకు కుటుంబ నియంత్రణ గురించి భార్యాభర్తలు మాట్లాడుకోవడం ఈరోజు నుండే ప్రారంభించండి అనే నినాదంతో కుటుంబ నియంత్రణ అవగాహన కల్పించనైనది. కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో శాశ్వత పద్ధతిలో పురుషులకు కోత కుట్టులేని వ్యాసక్టమి కుటుంబ నియంత్రణ ఆపరేషన్, సులువైనది, సురక్షితమైనదిగా, భర్తగా మీ బాధ్యత. కేవలం ఐదు నిమిషాల్లో ఈ ఆపరేషన్ చేయబడుతుంది.
అపోహలు వీడండి ఈ ఆపరేషన్ వలన మగవారికి శరీర పట్టుత్వానికి గాని దాంపత్య జీవితానికి గాని ఏలాంటి ఆటంకం రాదు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వేములవాడ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం సూపర్నెంట్ డాక్టర్ పెంచలయ్య గారు డిప్యూటీ డిఎం హెచ్ ఓ డాక్టర్ రజిత, డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ రాజగోపాల్ రావు మరియు ప్రాథమిక కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ దివ్యశ్రీ, డాక్టర్ రేణుక , డాక్టర్ కృష్ణవేణి డాక్టర్ గీతాంజలి, డాక్టర్ స్రవంతి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వేణుమాధవ్ డెమో రాజకుమార్, బాలయ్య, సంజీవ ,ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.