భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం ద్వారానే నేడు అందరూ ఫలాలను అందుకుంటున్నారని పేర్కొన్నారు. సమ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు