ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు డిజిటల్‌ టెక్నాలజీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 01:27 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః  మెరుగైన సమాజం కొరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణహిత డిజిటల్‌ టెక్నాలజీలో భాగంగా ఆధునిక ఈ-కామర్‌‌స, ఈ-హెల్‌‌త, ఈ-ఎడ్యూకేషన్‌ రంగాలపై ప్రధానంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు  తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌‌సపై నేడు ఢిల్లీలో జరిగిన ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎంటెక్‌ ఇండియా-2017 సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథలో భాగంగా రానున్న 18 నెలల కాలంలో ఇంటింటికి మంచినీరుతో పాటు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ను అందించనున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకోసం 1,20,000 కిలోమీటర్ల పైప్‌లైన్‌ వేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశాన్నే సానుకూలంగా మలచుకుంటూ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌ను వేయాలని నిర్ణయించామన్నారు. డిజిటల్‌ ఎకో సిస్టమ్‌లో డిజిటల్‌ అవస్థాపన, డిజిటల్‌ అక్షరాస్యత ప్రధానమైందన్నారు. కాగా సామాజిక ఉపయోగం లేని టెక్నాలజీ నిరర్థకమేన న్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీ-హబ్‌, టీ-బ్రిడ్‌‌జ వంటి కార్యక్రమాల గురించి మంత్రి వివరించారు. భారత్‌లో 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారేన …న్నారు. యువశక్తిని వినియోగించుకునేలా సైబర్‌ సెక్యూరిటీ, మల్టీమీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌, యానిమేషన్‌, గేమింగ్‌, డిజైనింగ్‌ తదితర రంగాల్లో ఉపాధి కల్పన దిశగా ప్రభుత్వాలు చొరవచూపాలని ఆయన పేర్కొన్నారు.  కేంద్ర మంత్రులు సురేష్‌ ప్రభు, గట్కరీతో మంత్రి కేటీఆర్‌ భేటీ  రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభుతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు భేటీ అయ్యారు. సురేష్‌ ప్రభును కలిసిన వారిలో మంత్రి కేటీఆర్‌తోపాటు ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర తేజావత్‌, ఇతర అధికారులు ఉన్నారు. పలు రైల్వే ప్రాజెక్టులకు రావాల్సిన నిధుల అంశంపై వారు చర్చించారు. రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  
ఈమేరకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో కేటీఆర్‌తోపాటు ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, అధికారులు నవీన్‌ మిట్టల్‌, అరవింద్‌ కుమార్‌ ఉన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధితోపాటు పలు అంశాలపై వారు గడ్కరీతో చర్చించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa