ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ సమావేశాల్లో దూకుడు కొనసాగిద్దాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 01:25 AM

-సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుదాం
-టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని తిప్పికొడదాం
-సమన్వయంతో సభలో వ్యవహరించాలని నిర్ణయం
-ఎమ్మెల్యేలకు, సీఎల్పీనేత మధ్యనున్న దూరాన్ని తగ్గించేందుకు దిగ్విజయ్‌ ప్రయత్నాలు  
-సీఎల్పీ భేటీకి ప్రత్యేకంగా హాజరు
-సభలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇటీవల దూకుడు పెంచిన కాంగ్రెస్‌పార్టీ, అసెంబ్లీ బడ్జెట్‌  సమావేశాల్లోనూ అదే వైఖరిని కొనసా గించనుందా ?,  పార్టీ శాసనసభాపక్ష నేత జానారెడ్డికి, శాసనసభ్యులకు  మధ్య నున్న దూరాన్ని  తగ్గించేందుకు కాంగ్రెస్‌  అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభిం చిందా ? అంటే అవుననే సమాధానాలు ఆపార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. గురువారం జరిగిన  సీఎల్పీ భేటీకి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌ హాజరుకావడమే దానికి నిదర్శనమని చెబుతున్నారు.  శుక్ర వారం నుంచి ప్రారంభం తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో  అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు దిగ్విజయ్‌ మార్గనిర్దేశం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై అధికారపార్టీని ఇరుకున పెట్టాలని శాసనసభాపక్షం నిర్ణయించింది. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించి, పూర్తి చేసిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభోత్స వాలు చేస్తూ, అంత తామే చేశామన్నట్టుగా ప్రచారం చేసుకుంటుందని ఎమ్మెల్యేలు  విమర్శించారు. టీఆర్‌ఎస్‌ చేసుకుంటున్న ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా సమర్ధవంతంగా  తిప్పికొట్టాలని నిర్ణయించారు.  సభలో సమన్వ యంతో వ్యవహరించడంతోపాటు,గత సమావేశాల్లో దొర్లిన తప్పిదాలు పునరా వృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు దిగ్విజయ్‌ సూచించారు. ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో సమన్వయలోపం వల్ల పార్టీ ఇమేజ్‌ డామేజయిందని పలువురు ఎమ్మెల్యేల ఫిర్యాదుపై ఆయన స్పందిస్తూ, ఇకపై అటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలని సీఎల్పీనేతకు హితవు పలికారు. శాసనసభా పక్షంలో ఎమ్మెల్యేలందరిదీ ఒకదారైతే,  సీఎల్పీ లీడర్‌ ఒక్కడిది ఒకదారి అన్నట్లుగా  పరిస్థితి తయారయిందని,  దీంతో  అసెంబ్లీ సమావేశాల్లో,  ఎమ్మెల్యేల దూకుడుకు జానా కళ్లెం వేస్తున్నారనే విమర్శలు గతకొంతకాలంగా  వినిపిస్తున్నాయి.   జానా తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు  ఎన్నిసా ర్లు అసంతృప్తి  వ్యక్తం చేసినా, ఆయన మాత్రం  తనవైఖరిని మార్చుకోవడం లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో, సీఎల్పీ సమావేశానికి దిగ్విజయ్‌ హాజరుకావాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు తెలిపాయి.  మరోవైపు సీఎల్పీ, పీసీసీ మధ్య కూడా సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్‌ఎస్‌  ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ,  పార్టీ నాయకత్వం  అనేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే, సీఎల్పీనేతగా  జానారెడ్డి ఆ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఇదే అంశాన్ని పార్టీ కేడర్‌ అనేక సంద ర్భాల్లో ప్రస్తావించిన సందర్భాలు లేకపోలేదని గుర్తు చేశారు.  అలాగే ప్రభు త్వాన్ని పార్టీ బయట ఎంత ఎండగట్టినా,  అసెంబ్లీలో ఆ దూకుడు కొనసాగిం చకపోతే పార్టీకి నష్టం జరుగుతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎల్పీ సమావేశానికి దిగ్విజ య్‌సింగ్‌ హాజరయ్యారంటున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారని పేర్కొంటున్నారు. .  ప్రధాన ప్రతిపక్షంగా రైతు, విద్యార్థి గర్జనలతో పాటు అనేక సమస్యలపై ఆందోళనలతో ప్రజలకు చేరువవుతున్నామని భావిస్తున్న కాంగ్రెస్‌నాయకత్వం, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లోను అదే దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa