ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటమరాయుడు గుండె జారిపోయింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 01:54 AM

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న కాటమరాయుడు చిత్రం పాటల సందడి మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలో మిరామిరా మీసం.. అనే పాటను విడుదల చేసిన చిత్ర బౄఎందం తాజాగా మరో పాటను విడుదల చేసింది. లాగే మనసు లాగే నీవెపే నను లాగే.. అని మొదలయ్యే ఈ పాట యూట్యూబ్‌లో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఓ పిల్లా.. ఓ పిల్లా.. అరె కాటమరాయుడు గుండెను అట్టా కాటావేసి పట్టుకుపోయావే.. అని చరణంలో వినిపించారు.
డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్‌‌స స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి శరత్‌మరార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 24న కాటమరాయుడు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa