హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సమావేశాలు మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. 13వ తేదీన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు మరింత గొప్పగా అందేలా 2017-18 బడ్జెట్ ఉంటుందని ఈటెల ఇప్పటికే ప్రకటించారు. సబ్‌ప్లాన్ నిబంధనలకు లోబడే దళిత, గిరిజన వర్గాలకు పూర్తి స్థాయి నిధులు కేటాయిస్తామని చెప్పారు. విభజన తర్వాత తొలిసారి లక్ష కోట్ల బడ్జెట్, రెండోసారి లక్షా 30 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి కూడా అదే స్థాయిలో బడ్జెట్ కు రూపకల్పన చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa