ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాసిల్‌లోని కేఫ్‌ 56పై దుండగుల దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 08:46 AM

జెనీవా: స్విట్జర్లాండ్‌లోని ఓ కేఫ్పై దుండగులు దాడి చేసి తుపాకులతో విచక్షణారహితంగ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డాడు. బాసిల్‌ పట్టణంలోని 'కేఫ్‌ 56'లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి 8:15 గంటల సమయంలో కేఫ్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు వస్తూనే కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం వారు రైల్వేస్టేషన్ వైపు పారిపోయారని తెలిపారు. అయితే ఈ దాడి వెనుకాల ఉగ్రకుట్ర ఉందా అనే విషయాన్ని మాత్రం పోలీసులు నిర్థారించలేదు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదని, విచారణ జరుగుతుందని బాసెల్‌ ప్రాసిక్యూటర్స్‌ ఆఫీస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa