ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తక్కువ సమయంలోనే ఎంతో ప్రగతి సాధించాం : గవర్నర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 11:06 AM

హైదరాబాద్ : దేశంలోనే నవ రాష్ట్రం తెలంగాణ అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. నూతన రాష్ట్రమైన తెలంగాణ తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. సంక్షేమ ఫలాలు ప్రతి పౌరునికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందన్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మొదటి స్థానాన్ని సాధించామని తెలిపారు. ప్రభుత్వం సులభతర వాణిజ్యం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. రాష్ట్రం 13.2 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపారు. సేవా రంగం 14.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధి 17.2 శాతంగా ఉందని తెలిపారు. ఒంటరి మహిళలకు నెలకు రూ.1000 జీవన భృతిని ఇవ్వనున్నట్టు తెలిపారు. స్కూళ్లు , హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. 27 వేలకు పైగా కొత్త ఉద్యోగాలను భర్తీ చేసినట్టు చెప్పారు. సాగుకు పగటిపూటే 9గంట విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను సమర్థవంతంగా అమలుజరుగుతోందన్నారు. 35.30 లక్షల మందిర రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గవర్నర్ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa