ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ప్రసంగంలో ఉన్నవన్నీ అవాస్తవాలే: టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 11:18 AM

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్ పార్టీ సభ్యులు మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోయారు. గవర్నర్ ప్రసంగంలో ఉన్నవన్నీ అవాస్తవాలే అని ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు గవర్నర్ ప్రసంగంలో లేనే లేవని వారు విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు ఊసే లేదని, దళితులకు మూడెకరాలు భూమి కేటాయింపు విషయం మర్చిపోయారని అన్నారు. పేద ప్రజల సంక్షేమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కనీస ప్రేమ కూడా లేదని మండిపడ్డారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa