హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభలో ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు అన్నారు. శాసన సభ గౌరవాన్ని కాంగ్రెస్ మంటగలిపిందని మండిపడుతూ వారి చర్యను ఖండించారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగలొద్దని, హుందాగా వ్యవహరించాలని గత బీఏసీ సమావేశాల్లోనే అందరి సమక్షంలో నిర్ణయించామని, అయినా ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగం సందర్భంగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో స్పష్టత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. స్లోగన్‌లతో సభలో గందరగోళానికి యత్నించారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రతిపక్షాల తీరును ఎండగట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa